పరిటాల శ్రీరామ్ కు కరోనా పాజిటివ్

  • తనకు కరోనా సోకిందని తెలిపిన పరిటాల శ్రీరామ్
  • స్వల్ప లక్షణాలతో కరోనా సోకిందని వెల్లడి
  • తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచన
థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని... ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించనున్నారు.


More Telugu News