ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- బదిలీల విషయంలో ఉద్యోగులు, టీచర్ల ఆందోళన
- ప్రగతిభవన్ ముట్టడికి పిలుపు
- 400 మంది వచ్చే అవకాశం
- వాహనాలను తనిఖీ చేస్తోన్న పోలీసులు
తెలంగాణలో ఉపాధ్యాయులు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. బదిలీల విషయంలో వారు కొంతకాలంగా ఆందోళన తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 317 జీవోను నిలిపివేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నేడు హైదరాబాద్, బేగంపేటలోని ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి.
ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సభ్యులు దాదాపు 400 మంది ప్రగతి భవన్ ముట్టడికి యత్నించే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
మరోపక్క, ఇప్పటికే బీఆర్కే భవనం ముందు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, శ్రీనగర్ కాలనీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయులు తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. 317 జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు.