ముంబైలోని హై రైజ్ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం.. ఏడుగురి మృతి!

  • 18వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో అగ్నికీలలు
  •  15 మందికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు 
  • 13 అగ్నిమాపక శకటాలతో సహాయక చర్యలు
ముంబైలోని బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నానా చౌక్ ప్రాంతంలో భాటియా హాస్పిటల్ సమీపంలోని కమలా బిల్డింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 7.30 గంటల సమయంలో 18వ అంతస్తులోని ఒక ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.  

13 అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ఆరంభించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లెవల్-3 ప్రమాదంగా దీన్ని గుర్తించారు. ఐదు అంబులెన్స్ లు కూడా చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 15 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది.


More Telugu News