కోలుకున్న మార్కెట్లు.. చివరి గంటలో లాభాలు!

  • 367 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6.88 శాతం లాభపడ్డ మారుతి సుజుకి షేరు విలువ
నిన్న కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు... చివరి గంటలో లాభాల్లోకి వెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 57,858కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 17,278కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (6.88%), యాక్సిస్ బ్యాంక్ (6.76%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.87%), భారతి ఎయిర్ టెల్ (3.23%).

టాప్ లూజర్స్:
విప్రో (-1.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.16%), టైటాన్ (-0.98%), ఇన్ఫోసిస్ (-0.85%), టెక్ మహీంద్రా (-0.80%).


More Telugu News