భారీ నష్టాల్లో మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్!

  • మార్కెట్లపై అమెరికా ఫెడ్ ప్రభావం
  • వడ్డీ రేట్లను పెంచుతామన్న ఫెడ్
  • 317 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా ఫెడ్ దెబ్బకు మన మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. మార్చిలో వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడం ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో, ఈరోజు మార్కెట్లు ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనమయింది.

ప్రస్తుతం సెన్సెక్స్ 1,062 పాయింట్లు నష్టపోయి 56,795కి పడిపోయింది. నిఫ్టీ 317 పాయింట్లు కోల్పోయి 16,960 వద్ద కొనసాగుతోంది. అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్ మినహా అన్ని కంపెనీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్, హెచ్సీఎల్, టెక్ మహీంద్రా, విప్రో తదితర కంపెనీలు భారీ లాభాల్లో ఉన్నాయి.


More Telugu News