'భీమ్లా నాయక్' రిలీజ్ విషయంలో డౌట్ లేనట్టే!

  • 'భీమ్లా నాయక్' గా పవన్
  • ఫిబ్రవరి 25వ తేదీన విడుదల
  • వాయిదా పడిందనే ప్రచారం
  • అదే రోజున రావడం ఖాయమంటున్న సినీ వర్గాలు  
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో, మరో ప్రధానమైన పాత్రలో రానా నటించాడు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనున్నారు. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరలేదు. ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఫిబ్రవరి 4వ తేదీన రావలసిన 'ఆచార్య' .. 11వ  తేదీన విడుదల కావలసిన 'మేజర్' సినిమాలు వాయిదాపడ్డాయి. అప్పటికి కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల చేయాలనే నిర్ణయంతో మేకర్స్ ఉన్నట్టుగా సినీ వర్గాల టాక్. తమన్ స్వరపరిచిన బాణీలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


More Telugu News