పగబట్టిన కాకి.. గుర్తించి మరీ కొందరిపైనే దాడి!
- కర్ణాటకలోని ఓబళాపురం గ్రామంలో ఘటన
- గోళ్లతో గీరుతూ, ముక్కుతో పొడుస్తూ దాడి
- ఏడుగురిపైనే దాడి
కాకులు పగబడతాయా? పగబట్టి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయా? అవుననే అంటున్నారు కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామస్థులు. తమ గ్రామంలో కొందరిపై కాకి పగబట్టి దాడి చేస్తోందని వాపోతున్నారు. దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ కాకి గ్రామస్థుల్లో కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుంది. వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి వారిపైనే దాడిచేస్తోంది. గోళ్లతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తోందని, మొత్తంగా గ్రామంలోని ఏడుగురిపై అది పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు తెలిపారు. గ్రామం నుంచి కాకిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నా వెళ్లడం లేదని గ్రామస్థులు తెలిపారు.