పద్మశ్రీ గ్రహీత కనకరాజుకు భారీ రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

  • జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం
  • ఇంటి నిర్మాణానికి రూ.1 కోటి
  • ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు పర్యవేక్షణ బాధ్యతలు
  • సీఎం కేసీఆర్ ఆదేశాలు
గుస్సాడీ నృత్యకళాకారుడు, పద్మశ్రీ పురస్కార విజేత కనకరాజుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదరణ చూపారు. కనకరాజుకు భారీ రివార్డు ప్రకటించారు. ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ.1 కోటి అందించనున్నట్టు తెలిపారు.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కనకరాజు ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు. ఆయన స్వస్థలం జైనూర్ మండలం మర్లవాయి గ్రామం. గత 55 ఏళ్లుగా ఆయన గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

కాగా, కనకరాజుకు జిల్లా కేంద్రంలో ఇంటి స్థలం కేటాయించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలను పర్యవేక్షించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సీఎం కేసీఆర్ ఆదేశించారు.


More Telugu News