'రావణాసుర' ఫస్టు డే అంటూ ఫొటో షేర్ చేసిన రవితేజ!
- 'రావణాసుర'గా రవితేజ
- ఆయన సరసన ఐదుగురు హీరోయిన్లు
- ప్రత్యేక పాత్రలో సుశాంత్
- దర్శకుడిగా సుధీర్ వర్మ
రవితేజ కథానాయకుడిగా 'రావణాసుర' రూపొందుతోంది. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ రోజున ఫస్టు డే ఎగ్జైట్మెంట్ అంటూ రవితేజ ఒక ఫొటో షేర్ చేశాడు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు కనువిందు చేయనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ ఆ జాబితాలో ఉన్నారు. ఐదుగురు హీరోయిన్లు అనగానే సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి అనేది ఏర్పడుతుంది.
సుధీర్ వర్మ అనగానే 'స్వామిరారా' సినిమానే గుర్తుకువస్తుంది. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఫస్టు పోస్టర్ తోనే ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ సినిమాలో, మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి. .
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు కనువిందు చేయనున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్ష నగార్కర్ .. పూజిత పొన్నాడ ఆ జాబితాలో ఉన్నారు. ఐదుగురు హీరోయిన్లు అనగానే సహజంగానే ఈ సినిమాపై ఆసక్తి అనేది ఏర్పడుతుంది.
సుధీర్ వర్మ అనగానే 'స్వామిరారా' సినిమానే గుర్తుకువస్తుంది. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. శ్రీకాంత్ విస్సా కథను అందించిన ఈ సినిమాలో సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఫస్టు పోస్టర్ తోనే ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ సినిమాలో, మరెన్ని విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి.