యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా వీడియో రూపొందించారని ఫిర్యాదు
- గతేడాది ఫిబ్రవరిలో రూపొందించిన లఘు చిత్రం
- సిరిసిల్ల నుంచి బంజారాహిల్స్‌కు కేసు బదిలీ
యూట్యూబర్ సరయు రూపొందించిన ఓ లఘు చిత్రం హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సరయు, ఆమె బృందంపై సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేయగా, ఆ వీడియోను హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చిత్రీకరించినట్టు తేలింది. దీంతో కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..‘7ఆర్ట్స్’ పేరుతో సరయు, ఆమె బృందం ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్’ కోసం వీరు ఒక లఘు చిత్రాన్ని రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన చానల్‌తోపాటు సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ఇందులో సరయు, ఆమె బృందం తలకు ‘గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న బ్యాండు ధరించారు. ఈ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచేలా ఉందని, అంతేకాకుండా మద్యం తాగి హోటల్‌కు వస్తారన్న ప్రచారం కూడా జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.