కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనం!

  • 1,023 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 302 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.65 శాతం తగ్గిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పతనమయ్యాయి. ఈ ఉదయం నెగెటివ్ గా ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అంతకంతకూ నష్టపోతూనే వచ్చాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడుతుండటం, క్రూడాయిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటం, అంతర్జాతీయంగా ప్రతికూలతలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,023 పాయింట్లు నష్టపోయి 57,621కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,213కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.88%), ఎన్టీపీసీ (0.67%), టాటా స్టీల్ (0.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.57%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.32%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.65%), ఎల్ అండ్ టీ (-3.20%), బజాజ్ ఫైనాన్స్ (-3.15%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.94%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.93%).


More Telugu News