టీమిండియాలో తిరిగి చోటు సంపాదించుకుంటాను: దినేశ్ కార్తీక్
- జట్టులోకి తిరిగి రావాలంటే వయస్సు ప్రామాణికం కాదు
- ఐపీఎల్‌పైనే దృష్టిపెట్టా.. సీఎస్కే తరఫున ఆడాలని ఉంది
- బాగా ఆడేందుకు వంద శాతం కృషి చేస్తాను
- ఐపీఎల్‌లో రాణించాలనే ఆలోచనతోనే సాధన చేస్తున్నాను
ప్రస్తుతం తాను ఐపీఎల్‌పైనే దృష్టిపెట్టానని టీమిండియా బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అంటున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను బాగా ఆడేందుకు వంద శాతం కృషి చేస్తానని చెప్పాడు. అలాగే తాను చెన్నై నుంచి వచ్చాను కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడితే గొప్పగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.
అయినప్పటికీ, తాను ఏ జట్టుకు ఆడినా గౌరవంగానే భావిస్తానని దినేశ్ కార్తీక్ చెప్పాడు. తాను ఐపీఎల్‌లో రాణించాలనే ఆలోచనతోనే సాధన చేస్తున్నట్లు తెలిపాడు. తాను టీమిండియా జట్టులోనూ తిరిగి చోటు సంపాదించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులోకి తిరిగి రావాలంటే వయస్సు ప్రామాణికం కాదని, బాగా రాణించడమే ప్రామాణికమని చెప్పాడు.
టీమిండియా బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడని దినేశ్ కార్తీక్ చెప్పాడు. తామిద్దరిదీ ఒకే వయస్సు అని తెలిపాడు. క్రికెటర్లు తమ శారీరక పరిస్థితులను అర్థం చేసుకుంటారని ఆయన అన్నాడు.
దాని వల్లే ఎంతకాలం క్రికెట్ ఆడగలరో ఒక అవగాహనతో ఉంటారని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. తాను అందుకోసమే ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌పై దృష్టి పెట్టానని తెలిపాడు. కాగా, దినేశ్ కార్తీక్ ప్రస్తుతం ముంబైలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు.