ఆ అమ్మాయి గురించి 'కొత్త కొత్తగా' సాంగ్ .. చూడండి!

  • ప్రేమకథగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'  
  • సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించడంలో ఇంద్రగంటి మోహనకృష్ణకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రేమ అనే అంశం చుట్టూ ఆయన అల్లుకునే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన డ్రామాను నడిపించే తీరు కొత్తగా ఉంటుంది. అందువలన ఆయన సినిమాలకి అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంటారు.

సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా ఆయన రూపొందించిన సినిమానే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను వదిలారు. "అల్లంత దూరంగా నువ్వు .. నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చేయాలో. రవ్వంత గారంగా నాలో నీ నన్ను మాటాడిస్తుంటే ఏం చెప్పాలో" అంటూ ఈ పాట సాగుతోంది.

వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చైత్ర - అభయ్ ఆలపించారు. పాటకి తగినట్టుగానే ట్యూన్ కొత్తగా ఉంది. కొన్ని వరుసల్లో ఫీల్ బాగా వర్కౌట్ అయింది. నాయకా నాయికల మధ్య పరిచయం .. ప్రేమ .. అల్లరి సన్నివేశాలపై సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది.


More Telugu News