హిజాబ్‌పై కల్వకుంట్ల కవిత స్పందన.. హిందీలో కవనం
- బొట్టు పెట్టుకోవడం నేను స్వయంగా తీసుకునే నిర్ణయం
- అలాగే, హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం
- మహిళలకు ఏది ఇష్టమో వాటిని ధరించాలి
- ఏ దుస్తులు ధరిస్తే వారికి సౌకర్యవంతంగా అనిపిస్తుందో వాటినే ధరించనివ్వాలి
బొట్టు పెట్టుకోవడం అనేది నైతికంగా తనకు తాను నిర్ణయం తీసుకునే అంశమని, అలాగే, హిజాబ్ ధరించడం అనేది ముస్కాన్ (కర్ణాటక యువతి) వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం అని కవిత ట్వీట్ చేశారు. మహిళలకు ఏది ఇష్టమో, ఏ దుస్తులు ధరిస్తే వారికి సౌకర్యవంతంగా అనిపిస్తుందో వాటినే ధరించనివ్వాలని కవిత అన్నారు. తమకు పాఠాలు చెప్పొద్దని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హిందీలో ఓ కవనం (కవిత)ను ఆమె పోస్ట్ చేశారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్.. మతం ఏదైనా సరే మనమంతా భారతీయులమేనని పేర్కొన్నారు. బొట్టు, హిజాబ్.. ఏది ధరించినప్పటికీ మన గుర్తింపు భారతీయతేనని చెప్పారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య, జై హింద్ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ, సారే జహాన్ సే అచ్చా అని రాసిన ఇక్బాల్, జన గణ మన రాసిన ఠాగూర్... వీరంతా చెప్పింది ఒక్కటేనని, మనమంతా భారతీయులమనేనని చెప్పారని ఆమె కవితలో పేర్కొన్నారు.