మోదీ చెప్పింది నిజమే.. నేను ఆయనకు భయపడను: రాహుల్ గాంధీ
- మోదీకి, సీబీఐ, ఈడీలకు నేను భయపడను
- మోదీ అహంకారం హాస్యాస్పదంగా ఉంది
- మోదీపై కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగలదన్న రాహుల్
ప్రధాని మోదీకి, కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు తాను భయపడనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్ లో అవినీతిపరులైన ముఖ్యమంత్రులను బీజేపీ మారుస్తోందని... ఒక దొంగ స్థానంలో మరో దొంగను కూర్చోబెడుతోందని అన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ తాను ప్రధాని మాట విననని అన్నారని... ఆయన చెప్పింది నిజమేనని, తాను ప్రధాని మాటను విననని చెప్పారు. మోదీ అహంకారం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దేశంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్లే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుందని రాహుల్ చెప్పారు.
మోదీపై కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేయగలదని అన్నారు. గత 70 ఏళ్లుగా దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మోదీ అన్నారని... అంటే 70 ఏళ్లుగా దేశం నిద్రపోతోందని ఆయన అంటున్నారా? అని ప్రశ్నించారు. మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. దేశంలో ఉన్న రోడ్లు, రైల్వే లైన్లు ఎవరు వేశారని ప్రశ్నించారు.