అమెరికా ద్రవ్యోల్బణం ప్రభావం... భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 773 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 231 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన టెక్ మహీంద్రా షేర్
అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మన మార్కెట్లు కూడా ఈరోజు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయి 58,152కి దిగజారింది. నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 17,374 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.94%), టాటా స్టీల్ (0.52%), ఎన్టీపీసీ (0.51%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.09%), ఐటీసీ (0.09%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.94%), ఇన్ఫోసిస్ (-2.71%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.31%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.21%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.16%).


More Telugu News