ఆ సమయంలో నేను మాత్రం నా ఫోన్ ను స్విచాఫ్ చేస్తాను: రోహిత్ శర్మ

  • ఐపీఎల్ వేలంపై టీమిండియా కెప్టెన్ అభిప్రాయం
  • ఏం జరుగుతోందనన్న ఆసక్తితో చూస్తారని వ్యాఖ్య
  • బెంగళూరులో 12, 13వ తేదీల్లో మెగా వేలం
ఐపీఎల్ వేలానికి సంబంధించి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ పై మూడో వన్డేలోనూ విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ‘‘ప్రతి ఒక్కరూ, ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోని ఆటగాళ్లు అందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఏం జరుగుతుందోనని ఆసక్తిగా చూస్తారు. నేను మాత్రం నా ఫోన్ ను స్విచాఫ్ చేస్తాను’’ అని చెప్పాడు.

అభిమానుల దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్లేయర్ల వరకు అందరూ శని, ఆదివారాల్లో టీవీలకు నిజంగానే అతుక్కుపోయే పరిస్థితే కనిపించనుంది. ఎందుకంటే 590 మంది ప్లేయర్లతో కూడిన మెగా వేలం ఈ రెండు రోజుల్లో మంచి రసవత్తరంగా జరగనుంది. కీలక ఆటగాళ్ల కోసం ఒకటికి మించిన జట్లు పోటీ పడనున్నాయి. దీంతో భారీ ప్యాకేజీ ఎవరికి లభిస్తుందో చూడాల్సి ఉంది.


More Telugu News