ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా నేరం కాదు.. కానీ, షరతులు వర్తిస్తాయ్: నితిన్ గడ్కరీ
- బ్లూటూత్ ద్వారా మాత్రమే మాట్లాడాలి
- చేతిలో ఫోన్ ను పట్టుకోకూడదు
- ఫోన్ ను కార్ లో కాకుండా జేబులో పెట్టుకోవాలి
- ఒకవేళ ఫైన్ వేసినా కోర్టులో సవాల్ చేసే వీలు
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ఇప్పటిదాకా నేరమే. ఇక నుంచి అది నేరం కాదని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే, దానికంటూ కొన్ని షరతులు వర్తిస్తాయని పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రకటన చేశారు.
ఫోన్ ను నేరుగా పట్టుకొని మాట్లాడడం మాత్రం నేరమన్నారు. ఫోన్ ను చేతిలో పట్టుకోకుండా బ్లూటూత్ డివైస్ తో మాట్లాడితే నేరం కాదన్నారు. అయితే, ఆ సమయంలో ఫోన్ ను కారులో పెట్టరాదని, జేబులోనే పెట్టుకుని మాట్లాడాలని చెప్పారు.
ఒకవేళ బ్లూటూత్ లో ఫోన్ మాట్లాడేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేస్తే కోర్టులో సవాల్ చేయవచ్చని స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కొంచెం ఊరటే అయినా ఆకతాయిలు అలుసుగా తీసుకునే ప్రమాదం లేకపోలేదు. జనాలూ నిర్లక్ష్యంగా ఉండే ముప్పూ ఉంటుంది.