'రావణాసుర'ను పరిగెత్తిస్తున్న రవితేజ!
- నిన్న విడుదలైన 'ఖిలాడి'
- ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
- రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసిన 'రావణాసుర'
- రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు
రవితేజ తన సినిమాల విషయంలో ఎంత మాత్రం గ్యాప్ రానీయడు. కథ వినడం దగ్గర నుంచి ఆ సినిమా థియేటర్లకు వెళ్లేవరకూ ఎక్కడా నాన్చడం ఆయనకి అలవాటు లేదు. అందువల్లనే ఆయన నుంచి ఏడాదికి మూడు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలా ఈ ఏడాది ఆరంభంలో మొదటి సినిమాగా నిన్న 'ఖిలాడి' థియేటర్లకు వచ్చింది.
ఇక ఆ తరువాత సినిమాగా ఆయన శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా మార్చి 25న గానీ ఏప్రిల్ 15వ తేదీన గాని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ తరువాత సినిమాగా ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' చేస్తున్నాడు.
శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. ఇక తాజాగా 'రావణాసుర' కూడా రెండవ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదిలింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.