ఐపీఎల్ వేలం: భారత సంతతి వెస్టిండీస్ ఆటగాడి కోసం పంతం నెగ్గించుకున్న సన్ రైజర్స్
- కొందరు ఆటగాళ్లపై కన్నేసిన సన్ రైజర్స్
- వారి కోసం వేలంలో భారీ ధర
- పూరన్ కోసం రూ.10.75 కోట్లు
- నటరాజన్ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన వైనం
ఐపీఎల్-15 ఆటగాళ్ల మెగా వేలం కొనసాగుతోంది. వేలం తొలి సెట్ లో స్తబ్దుగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రెండో సెట్ లో చురుకుగా వ్యవహరిస్తోంది. భారత సంతతి వెస్టిండీస్ ఆటగాడు, కౌంటర్ అటాకింగ్ స్పెషలిస్టు నికోలాస్ పూరన్ కోసం భారీగా వెచ్చించింది.
పూరన్ ను చేజిక్కించుకునేందుకు అనేక ఫ్రాంచైజీలు చివరి వరకు పోటీపడినా, రూ.10.75 కోట్లతో సన్ రైజర్స్ కైవసం చేసుకుంది. టీ20 క్రికెట్లో పూరన్ గణాంకాలు మామూలుగా లేవు. 4 వేలకు పైగా పరుగులు, 113 క్యాచ్ లు అతడి ఖాతాలో ఉన్నాయి. స్ట్రయిక్ రేటు 142.46. పూరన్ మిడిలార్డర్ లో జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడమే కాదు, బంతిని అవలీలగా స్టాండ్స్ లోకి పంపగలడు.
ఇక, సన్ రైజర్స్ జట్టు తమిళనాడు బౌలర్ నటరాజన్ ను కూడా వేలంలో కొనుగోలు చేసింది. నటరాజన్ ను రూ.4 కోట్లకు చేజిక్కించుకుంది.