ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ మేఘాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • 1,747 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 531 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఐదున్నర శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఇదే భయాలతో మన మార్కెట్లు సైతం తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు  ట్రేడింగ్ ముగిసే సమయానికి ఏకంగా 1,747 పాయింట్లు కోల్పోయి 56,405కి పడిపోయింది. నిఫ్టీ 531 పాయింట్లు పతనమై 16,842 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టీసీఎస్ (1.05%) మాత్రమే లాభపడింది. టాటా స్టీల్ (-5.49%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-5.33%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (-5.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.52%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.


More Telugu News