'ఈటి' నుంచి తెలుగు లిరికల్ సాంగ్ రిలీజ్!
- పాండిరాజ్ తాజా చిత్రంగా 'ఈటి'
- సూర్య జోడీగా ప్రియాంక మోహన్
- మార్చి 10వ తేదీన విడుదల
- అదే రోజున తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోను రిలీజ్
సూర్య కథానాయకుడిగా తమిళంలో 'ఇతరుక్కుమ్ తునింధవన్' అనే సినిమా రూపొందింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు మలయాళ .. కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను 'ఈటి' అనే టైటిల్ తో వదులుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "సిలుకు జుబ్బా స్మార్టు .. పెట్టేశావే స్పాటు .. పొడవకురో గుండెల్లోనా పోటు" అంటూ ఈ పాట సాగుతోంది. ఇమాన్ స్వరపరిచిన ఈ పాటకి వనమాలి సాహిత్యాన్ని అందించగా, హరిచరణ్ - శ్రీనిధి ఆలపించారు.
సూర్య - ప్రియాంక మోహన్ పై చిత్రీకరించిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఇది మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఫాస్టు బీట్. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, సత్యరాజ్ .. శరణ్య .. రాజ్ కిరణ్ .. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు. చాలా గ్యాప్ తరువాత థియేటర్స్ కి వస్తున్న సూర్య సినిమా ఇది.