'గాడ్ ఫాదర్' షెడ్యూల్ పూర్తిచేసిన నయనతార!

  • 'గాడ్ ఫాదర్' షూటింగులో నయన్
  • మరో షెడ్యూల్ పూర్తిచేసిన మోహన్ రాజా
  • నయన్ తో మూడో సినిమా అంటూ ట్వీట్
  • గతంలో చేసిన రెండు సినిమాలు హిట్టే  
తమిళంలో వరుస సినిమాలతో నయనతార ఫుల్ బిజీగా ఉంది. విఘ్నేశ్ శివన్ తో కలిసి సొంత బ్యానర్లో సినిమాల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో ఆమె మరింత బిజీ అయింది. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి కొన్ని సినిమాలు వెళ్లినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. కానీ చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో చేయడానికి మాత్రం అంగీకరించింది.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చకచకా నిర్మాణాన్ని జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగులో నయనతార జాయినైంది. ఆమె పాల్గొనగా ఒక కీలకమైన షెడ్యూల్ ను పూర్తిచేశామని దర్శకుడు మోహన్ రాజా ట్వీట్ చేశాడు. ఆమెతో కలిసి మూడోసారి వర్క్ చేయడం తనకి ఆనందంగా ఉందని ఆయన చెప్పాడు.

ఆ సందర్భంలో నయనతారతో దిగిన ఒక ఫొటోను ఆయన షేర్ చేశాడు. ఇంతకుముందు నయనతారతో మోహన్ రాజా 'తని ఒరువన్' .. 'వేలైక్కారన్' సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా అక్కడ భారీ విజయాలను నమోదు చేశాయి. ఇక 'గాడ్ ఫాదర్' ఏ స్థాయి రికార్డులను నమోదు చేస్తుందనేది చూడాలి.


More Telugu News