మొదలైన భానుడి ప్రతాపం.. మార్చి 1 నుంచి వేసవి సీజన్!
- 32 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రత
- వేసవిలో సగటున 40 డిగ్రీల సెల్సియస్
- గతేడాది మాదిరే ఎండ ప్రభావం
- దక్షిణ గాలుల ప్రభావంతో పొడి వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం తగ్గిపోతోంది. ఎండ ప్రభావం ఇప్పటికే మొదలైనట్టు వాతావరణ శాఖ హైదరాబాద్ కార్యాలయం తెలిపింది. తెలంగాణలో శీతాకాలం ముగిసిపోతోందని, మెర్క్యురీ స్థాయులు చాలా ప్రాంతాల్లో పెరగడం మొదలైనట్టు ప్రకటించింది. మార్చి 1 నుంచి వేసవి ఆరంభమవుతుందని తెలిపింది.
గురువారం హైదరాబాద్ లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠం, 32.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 15-21 డిగ్రీల మధ్య కనిష్ఠం, 31-32 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి క్రమంగా పెరగనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
‘‘ప్రస్తుతం దక్షిణం నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తుండడంతో పొడి వాతావరణం నెలకొంది. వచ్చే కొన్ని వారాల్లో ఇక వేసవి సీజన్ మొదలవుతుందని అంచనా వేస్తున్నాం. ఎండ తీవ్రత సీజన్ మొత్తం మీద 40 డిగ్రీల స్థాయిలో ఉండనుంది’’ అని వాతావరణ కేంద్రం ఇంచార్జ్ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కాగా, గతేడాది వేసవి సీజన్ లో ఎండ తీవ్రత కొంత తక్కువగా ఉంది. ఈ ఏడాది కూడా అదే మాదిరి వాతావరణం ఉండొచ్చని వాతావరణ పరిశోధకుల అంచనాగా ఉంది.