రష్యా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు
- 382 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 114 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉక్రెయిన్ లోని రెండు రాష్ట్రాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తున్నామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. మన దేశీయ మార్కెట్లు కూడా ఈరోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 382 పాయింట్లు నష్టపోయి 57,300కు పడిపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి 17,092కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.78%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.43%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.85%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.62%), సన్ ఫార్మా (0.37%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.64%), టీసీఎస్ (-3.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.67%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.51%).