సమంత, నయనతారల సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

  • విఘ్నేశ్ శివన్ నుంచి విభిన్న కథా చిత్రం
  • సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా  
  • కథానాయకుడిగా విజయ్ సేతుపతి
  • ఏప్రిల్ 28వ తేదీన విడుదల  
ఒక హీరో .. ఇద్దరు హీరోయిన్ల ప్రేమ నేపథ్యంలో సాగే కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే హీరో ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించడం .. చివరికి చిక్కుల్లో పడటం చూపిస్తుంటారు. అప్పుడు ఇద్దరు హీరోయిన్లు 'వాడు నీవాడు .. కాదు నీవాడు' అని పాట పాడుకోవడం కూడా ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు.

అలా కాకుండా ఇద్దరు హీరోయిన్లను హీరో సమానంగా ప్రేమించడం .. ఆ ఇద్దరూ కలిసి అంతే ఇదిగా ఆయనను ప్రేమిస్తే చివరికి ఏం జరిగింది? ఏం మిగిలింది? అనే ప్రశ్నలకి సమాధానమే 'కాతువాకుల రెండు కాధల్' సినిమాలోని సారాంశం అనే మాట వినిపిస్తోంది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

తమిళంతో పాటు తెలుగులోను సమంత - నయనతారలకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్స్ కలిసి యాక్ట్ చేసిన సినిమా ఇదే. ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు విఘ్నేశ్ శివన్ చెప్పాడు. తెలుగులోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.


More Telugu News