వయసు 55.. 65 పుషప్ లు.. ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలు.. ఐటీబీపీ వీరుని వీడియో ఇదిగో!
- ఐటీబీపీ కమాండెంట్ సూపర్ ఫిట్ నెస్
- లడఖ్ లో 17,500 అడుగుల ఎత్తులో నిర్వహణ
- 20,177 అడుగుల కర్జోక్ కంగ్రి పర్వాతారోహణ
సైన్యంలో పని చేయాలంటే.. అది కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయాలంటే.. శారీరకంగా ఎంతో పటిష్ఠత కావాలి. వేలాది మంది భారత సైనికులు నిత్యం మన దేశ సరిహద్దుల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని విధులు నిర్వహిస్తుంటారు. వారి సేవలే ఈ దేశానికి రక్ష.
ఇటువంటి భరతమాత ముద్దు బిడ్డల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కు చెందిన 55 ఏళ్ల కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్ గురించి కూడా చెప్పుకోవాలి. ఐటీబీపీకి చెందిన ఆరుగురు పర్వతారోహకులు కర్జోక్ కంగ్రి పర్వతాన్ని గత వారం అధిరోహించగా, ఈ బృందానికి సోనాల్ నాయకత్వం వహించాడు. 20,177 అడుగుల ఎత్తున్న ఈ పర్వతాన్ని అధిరోహించడం ఇదే మొదటిసారి. లడఖ్ ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శిఖరాన్ని ఈ నెల 20న ఈ బృందం చేరుకుంది. ఆ సమయంలో అక్కడ మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం గమనార్హం.
లడఖ్ లో 17,500 అడుగుల ఎత్తులో సోనాల్ తీసిన 65 పుషప్ ల వీడియోను ఐటీబీపీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. తీవ్రమైన చలికాలంలో శారీరక, మానసిక దృఢత్వం అన్నది కీలకమవుతుందని ఐటీబీపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.