ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌లో క‌లిసిపోయిన త‌మ‌న్.. థియేట‌ర్లో తెర వ‌ద్ద‌కు వెళ్లి డ్యాన్స్.. వీడియో వైర‌ల్

  • థియేట‌ర్లో లాలా భీమ్లా పాట‌కు డ్యాన్స్
  • థియేట‌ర్ల వద్ద అభిమానుల సంద‌డి
  • వారిలో మరింత ఉత్సాహం నింపిన త‌మ‌న్
పవన్ కల్యాణ్‌, రానా నటించిన ‘భీమ్లానాయక్‌’ సినిమా నిన్న‌ విడుద‌లైన విష‌యం తెలిసిందే. థియేట‌ర్ల వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ చేస్తోన్న హంగామా మామూలుగా లేదు. థియేట‌ర్ల వ‌ద్ద భారీగా క‌న‌ప‌డుతున్నారు. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో మ‌రింత ఖుషీ అవుతున్నారు. డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, ట‌పాసులు పేల్చుతూ థియేట‌ర్ల వ‌ద్ద‌ హోరెత్తిస్తున్నారు. వారిలో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ కూడా క‌లిసిపోయారు. 

ఈ సినిమాకు ఆయ‌నే సంగీతం అందించిన విష‌యం తెలిసిందే. ఓ థియేట‌ర్‌లో సినిమా చూసేందుకు వెళ్లిన త‌మ‌న్.. లాల్ లాల్ భీమ్లా పాట వ‌స్తోన్న స‌మ‌యంలో తెర వ‌ద్ద‌కు వెళ్లి అభిమానుల‌తో క‌లిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో అభిమానుల్లో మ‌రింత జోష్ నిండింది. ఈ వీడియోను స్వ‌యంగా త‌మ‌న్ పోస్ట్ చేశారు. 
                        
మ‌రోవైపు, రెండో రోజు కూడా ఉద‌యం నుంచి భీమ్లా నాయ‌క్ ఆడుతోన్న సినిమా హాళ్ల వ‌ద్ద అభిమానులు ర‌చ్చ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. కొన్ని థియేట‌ర్ల వ‌ద్ద ఇసుక‌వేస్తే రాల‌నంతగా జ‌నం క‌న‌ప‌డుతుండ‌డం విశేషం. 

ఏపీలో థియేట‌ర్లపై క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు అవుతున్న‌ప్ప‌టికీ భారీగానే క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. కరోనా ప్ర‌భావం కూడా త‌గ్గ‌డంతో జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తున్న‌ట్లు ప్రేక్ష‌కులు భీమ్లా నాయ‌క్ సినిమాను చూడ‌డానికి వ‌స్తున్నారు.  కాగా, సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిత్యా మీన‌న్ న‌టించింది.


More Telugu News