ఢిల్లీలో ఇక బైక్‌పై మాస్క్ అక్క‌ర్లేదు.. ఆ జ‌రిమానా రూ.500కు త‌గ్గింపు

  • భారీగా త‌గ్గిపోతున్న క‌రోనా కొత్త కేసులు
  • ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వాలు
  • ఈ దిశ‌గానే ఢిల్లీ స‌ర్కారు తాజా ఉత్త‌ర్వులు
దేశంలో క‌రోనా విస్తృతి గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్న నేప‌థ్యంలో క‌రోనా ఆంక్ష‌లు కూడా స‌డ‌లుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు దేశంలో రోజుకు 2 ల‌క్ష‌ల మేర న‌మోదైన కొత్త కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 10 వేల‌కు దిగిపోయింది. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాలు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ఆంక్ష‌ల‌ను భారీగా స‌డ‌లిస్తూ ఆప్ స‌ర్కారు శ‌నివారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఢిల్లీ స‌ర్కారు జారీ చేసిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ఇక‌పై బైక్‌పై వెళ్లే వారు మాస్క్ ధ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. అదే విధంగా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ లేకుండా తిరిగే వారిపై ఇదివ‌ర‌కు విధించే జ‌రిమానా రూ.2 వేల‌ను రూ.500ల‌కు త‌గ్గింది. ఫోర్‌ వీలర్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మాస్క్‌ ధరించాలన్న నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల తొలగించిన సంగ‌తి తెలిసిందే.


More Telugu News