ఆ 219 మందిలో తెలుగు వాళ్లు ఐదుగురు
- తొలి ఫ్లైట్‌లో ఎక్కిన వారంతా సేఫ్‌గా ముంబై చేరిక
- బుకారెస్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం
- ముంబై నుంచి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు ముమ్మరం
యుద్ధ భూమి ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న తొలి విమానంలో 219 మంది కాసేపటి క్రితమే ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ 219 మంది భారతీయుల్లో తెలుగు నేలకు చెందిన వారు ఐదుగురున్నారు. భారత విదేశాంగ శాఖ సూచనలను పాటిస్తూ ఉక్రెయిన్ నుంచి ఎలాగోలా రొమేనియా సరిహద్దులకు చేరుకున్న 219 మంది భారతీయులను అక్కడి భారత ఎంబసీ అధికారులు.. ఎయిరిండియా విమానంలో ఎక్కించి బుకారెస్ట్ నుంచి ముంబైకి పంపిన సంగతి తెలిసిందే.
యుద్ధంతో భీతావహ వాతావరణం నెలకొన్న ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడి విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు. అలాంటి వారిలో భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు భారత విదేశాంగ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రావాలని అక్కడి భారతీయులకు సూచనలు ఇచ్చింది. ఆ సూచనలు పాటిస్తూ 219 మంది రొమేనియా సరిహద్దుకు చేరుకోగా.. వారిని ఎయిరిండియా విమానంలో ముంబై పంపింది. కాసేపటి క్రితం ముంబై చేరుకున్న వీరిలో ఐదుగురు తెలుగు వారు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు వారితో పాటు విమానం నుంచి దిగిన వారిని వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి.