కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ
- నిన్న సాయంత్రం ఢిల్లీకి కేసీఆర్
- పలు పార్టీల మద్దతు కూడగడుతోన్న వైనం
- ఎన్డీఏపై పోరాటానికి ప్రణాళికలు
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కాసేపట్లో కేసీఆర్ భేటీకానున్నారు. బీజేపీని ఓడించేలా దేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ప్రణాళిక రూపొందించడం, ప్రతిపక్షాల మద్దతు కూడగట్టడం వంటి అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. దేశంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కూడగట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ తదితరుల మద్దతు లభించింది. ఢిల్లీ పర్యటనలో ఎవరెవరిని కలవాలన్న అంశంపై నిన్న మంత్రులతోనూ కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది.