నిత్యామీనన్ చాలా ఫీలైందట!
- కథానాయికగా నిత్యామీనన్ కి క్రేజ్
- ఈ మధ్య కాలంలో తగ్గిన అవకాశాలు
- 'భీమ్లా నాయక్'లో మంచి రోల్
- తన పాట తీసేయడం పట్ల అసంతృప్తి
మొదటి నుంచి కూడా నిత్యామీనన్ తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది. నటనకి అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్య కాలంలో ఆమె మాత్రమే చేయదగిన పాత్రలు రాలేదనే అనుకోవాలి. కొంత గ్యాప్ తరువాత ఆమె చేసిన సినిమానే 'భీమ్లా నాయక్'.
ఈ సినిమాలో పవన్ భార్యగా నిత్యామీనన్ కనిపించింది. తన సహజమైన నటనతో ఆ పాత్రలో ఆమె మెప్పించింది. ఈ సినిమా నుంచి 'అంత ఇష్టం ఏందయ్యా' అనే పాటను రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే సినిమాలో ఈ పాట లేదు .. కథకి అడ్డు తగులుతుందని లేపేశారట.
సినిమాలో ఇది నిత్యామీనన్ వైపు నుంచి వచ్చే పాట. తనకి నచ్చిన పాట .. తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందనుకున్న పాటను లేపేయడం వలన నిత్యామీనన్ చాలా ఫీలైందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆమె అందుకనే రాలేదని చెప్పుకుంటున్నారు. ఇక ఆ స్టేజ్ పై ఆమె పేరును ప్రత్యేకించి ఎవరూ చెప్పకపోవడం కూడా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.