ఈ ‘ఇన్ స్టా గ్రామ్’ స్కామ్ లో చిక్కుకోకండి.. గుర్తించడం ఇలా...!
- ఆకర్షించే క్యాప్షన్ తో ఇన్ స్టా గ్రామ్ లింక్
- క్లిక్ చేస్తే నకిలీ ఇన్ స్టా గ్రామ్ పేజీ
- లాగిన్ వివరాలు లీక్
- హ్యాకర్ల నియంత్రణలోకి ఖాతా
గత ఏడాది కనిపించిన ఇన్ స్టా గ్రామ్ డీఎం స్కామ్ మరోసారి వ్యాప్తిలోకి వచ్చింది. ఈ స్కామ్ లో సైబర్ మోసగాళ్లు యూజర్ల వివరాలను వారికి తెలియకుండా నేర్పుగా కొట్టేయడాన్ని గమనించొచ్చు. 2021 జూన్ లో మొదటిసారి ఈ స్కామ్ ను గుర్తించారు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నట్టు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్కామ్ బారిన పడకుండా తగిన అవగాహనతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.
ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే..? మోసగాళ్లు ఆకర్షించే పోస్ట్ లతో యూజర్లను బోల్తా కొట్టిస్తుంటారు. ‘దీన్ని చేయడానికి నాకు 3 గంటలు పట్టింది. మీరు దీన్ని ఇష్టపడతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను’ అనే అర్థంతో లింక్ ఉంటుంది. అది చూడడానికి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ మాదిరే ఉంటుంది. అక్కడ కనిపించే వీడియోను చూద్దామని ఆసక్తితో క్లిక్ చేస్తే అప్పుడు ఇన్ స్టా గ్రామ్ లాగిన్ పేజీ తెరుచుకుంటుంది.
కానీ, అది నిజమైన ఇన్ స్టా గ్రామ్ కాదు. లాగిన్ అవ్వకుండా వీడియో చూడడం సాధ్యపడదనే సందేశం కనిపిస్తుంది. లాగిన్ అయ్యారో.. మోసగాళ్లు ఆశించింది నెరవేరినట్టే. మీ లాగిన్ వివరాలన్నీ వారికి చేరిపోతాయి. టైప్ చేసే లాగిన్ వివరాలను నకిలీ పేజీ రూపంలో వారు కొట్టేస్తారు. దాంతో మీ ఇన్ స్టా గ్రామ్ ఖాతా వారి నియంత్రణలోకి వెళ్లిపోతుంది. దాన్ని రిలీజ్ చేయాలంటే డబ్బు డిమాండ్ చేస్తారు.
అందుకే ఇన్ స్టా గ్రామ్ నుంచి ఏదైనా వెబ్ లింక్ ను క్లిక్ చేస్తే, తర్వాత కనిపించే పోర్టల్ చిరునామాను జాగ్రత్తగా పరిశీలించాలి. హెచ్ టీపీపీఎస్ ఉంటే సెక్యూర్డ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ముఖ్యమైన యూఆర్ఎల్ లు హెచ్ టీపీపీఎస్ కు మారిపోయాయి. హెచ్ టీపీపీ అని ఉంటే సందేహించాల్సిందే.