భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- మార్కెట్లపై యుద్ధం ప్రభావం
- 778 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 187 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అంతకంతకూ ముదురుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరుస్తోంది. దీంతోపాటు, అంతర్జాతీయంగా ఎలాంటి అనుకూలతలూ లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 778 పాయింట్లు కోల్పోయి 55,468కి పడిపోయింది. నిఫ్టీ 187 పాయింట్లు పతనమై 16,605 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.54%), టైటాన్ (1.88%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.67%), నెస్లే ఇండియా (1.06%), యాక్సిస్ బ్యాంక్ (1.03%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-6.00%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-5.14%), ఏసియన్ పెయింట్స్ (-4.53%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.74%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.70%).