లాభాల్లో ప్రారంభమై.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
- 366 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 107 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 6.47 శాతం పతనమైన అల్ట్రాటెక్ సిమెంట్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఆ రోజు ఉదయం లాభాల్లోనే మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 366 పాయింట్లు నష్టపోయి 55,102కి పడిపోయింది. నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 16,498కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.34%), విప్రో (2.58%), టెక్ మహీంద్రా (2.43%), హెచ్సీఎల్ (2.08%), ఐటీసీ (1.90%).
టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-6.47%), ఏసియన్ పెయింట్స్ (-5.20%), డాక్టర్ రెడ్డీస్ (-3.49%), మారుతి (-2.76%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.65%).