ఏపీలో కరోనా మరణాల్లేవ్.. స్వల్పంగా పెరిగిన కేసులు
- గత 24 గంటల్లో 13,460 కరోనా టెస్టులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 23 కేసులు
- ఇంకా 1,543 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అంతేకాకుండా వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనాతో గురువారం నాడు మరణాలేమీ సంభవించలేదు.
అదే సమయంలో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,176 మంది కరోనా బారిన పడగా, వారిలో 23,01,904 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,543 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా కారణంగా మరణాలేమీ లేకపోవడంతో కరోనాతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 14,729గానే ఉంది.