శ్రీలంకతో తొలి టెస్టు.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే టాస్ గెలిచిన రోహిత్ శర్మ
- శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత్
- కోహ్లీకి ఇది చారిత్రక టెస్టు
- సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్ వంటి దిగ్గజాల సరసన చోటు
- వందో టెస్టులో 100 పరుగుల కోసం అభిమానుల ఎదురుచూపు
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మారికాసేపట్లో శ్రీలంకతో మొహాలీలో ప్రారంభం కానున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టులోనే టాస్ గెలవడం గమనార్హం.
మరోవైపు, ఈ మ్యాచ్ టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి కీలక మైలురాయి కానుంది. అతడికిది వందో టెస్టు. ఫలితంగా వంద టెస్టులు ఆడిన 12వ ఇండియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కబోతున్నాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ.. కోహ్లీ కంటే ముందున్నారు.
కోహ్లీ వందో టెస్టు నేపథ్యంలో 50 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నారు. 2001లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసిన కోహ్లీ ఆ మ్యాచ్‌లో 4, 15 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, ఆ తర్వాత మాత్రం రికార్డుల రారాజుగా ఎదిగాడు. ఈ పదేళ్ల తన కెరియర్‌లో ఎన్నో మైలురాళ్లు అధిగమించాడు. 50.39 సగటుతో 7,962 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్న కోహ్లీ వందో టెస్టులో వంద పరుగులు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.