ఝార్ఖండ్ బ‌య‌లుదేరిన సీఎం కేసీఆర్

  • ముగిసిన‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌
  • కాసేప‌ట్లో గల్వాన్‌ అమర సైనికుల కుటుంబాలకు సాయం 
  • అనంత‌రం ఝార్ఖండ్‌ సీఎంతో చ‌ర్చ‌లు
  • ఎన్డీఏకు వ్య‌తిరేకంగా కూట‌మికి య‌త్నం
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చికిత్స కోసమే ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్నార‌ని టీఆర్ఎస్ అంటోంది. నేడు ఢిల్లీలో కేసీఆర్‌ పర్యటన ముగిసింది. విమానాశ్ర‌యం నుంచి ఆయ‌న ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ బయల్దేరారు. కాసేప‌ట్లో ఆయ‌న గల్వాన్‌ అమర సైనికుల కుటుంబాలను పరామర్శించనున్నారు. గ‌ల్వాన్ అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం సాయం చేస్తుంద‌ని గ‌తంలో కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

ఇచ్చిన హామీ మేర‌కు ఆర్థిక సాయం చెక్కులను ఆయా కుటుంబాల‌కు కేసీఆర్ అందించ‌నున్నారు. అనంత‌రం ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో స‌మావేశం కానున్నారు. ఎన్డీఏకు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ప్ర‌తిప‌క్షాల‌ును ఏకం చేయ‌డంలో భాగంగా సోరేన్‌తో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌ ముగిశాక ఆయా రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్థిక‌ సాయం అందించ‌నున్నారు. 



More Telugu News