ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం కన్నుమూత
- ఆస్ట్రేలియా లెజెండరీ కీపర్ రాడ్ మార్ష్ కన్నుమూత
- ఆయన వయసు 74 ఏళ్లు
- 95 టెస్టులు, 92 వన్డేలు ఆడిన మార్ష్
క్రికెట్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అడిలైడ్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన మరణించినట్టు స్పోర్ట్స్ ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్ తెలిపింది. 1970 నుంచి 1984 వరకు ఆస్ట్రేలియా తరపున ఆయన 96 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఆస్ట్రేలియా దిగ్గజ కీపర్ గా పేరుతెచ్చుకున్నాడు. 74 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.
ఇక వికెట్ కీపర్ గా 355 ఔట్ లు చేశారు. ఆస్ట్రేలియా తరపున రాడ్ మార్ష్ 92 వన్డేలు కూడా ఆడాడు. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ ఈయనే కావడం గమనార్హం. రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లోని జాతీయ క్రికెట్ అకాడెమీలకు ఆయన నాయకత్వం వహించారు. ఐసీసీ ప్రపంచ కోచింగ్ అకాడెమీకి ప్రారంభ అధిపతిగా పని చేశారు. 2014లో ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్ గా నియమితులయ్యారు.