ఆల్కహాల్ ను నిషేధించాలి..: ఢిల్లీ హైకోర్టులో పిల్
- లేదంటే వాటి వినియోగాన్ని నియంత్రించాలి
- లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ముద్రించాలన్న పిటిషనర్
- ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడానికి కోర్టు తిరస్కరణ
ఢిల్లీలో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు (డ్రగ్స్) నిషేధించాలని లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ముద్రించడం సాధ్యపడదని న్యాయవాది అశ్విన్ కుమార్ ధర్మాసనానికి విన్నవించారు. ఈ కేసులో ఢిల్లీ సర్కారుకు నోటీసులు ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో ఏం చేయగలమన్నది తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామంటూ జులై 4కు వాయిదా వేసింది.