నెగెటివ్ రోల్ తో అజిత్ మతిపోగొడతాడట!
- నిరాశ పరిచిన అజిత్ 'వలిమై'
- నెక్స్ట్ ప్రాజెక్టుకి గ్యాప్ ఇవ్వని అజిత్
- వినోద్ దర్శకత్వంలో మూడో సినిమా
- బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే కథ
అజిత్ గతంలో 'వాలి' వంటి రెండు మూడు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించాడు. అలా ఆయన నెగెటివ్ రోల్ చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి ఒక నెగెటివ్ రోల్ ను ఆయన మరోసారి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే ఆయన సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.
మామూలుగా అజిత్ కి ఒక డైరెక్టర్ టేకింగ్ నచ్చితే ఫ్లాపులు వచ్చినా పెద్దగా పట్టించుకోడు. ఆ డైరెక్టర్ తోనే వరుస సినిమాలు చేస్తూ వెళతాడు. అలా ఆయన దర్శకుడు హెచ్. వినోద్ తో 'నెర్కొండ పార్వై' సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో 'వలిమై' ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది.
అయినా ఆయన దర్శకత్వంలోనే తన తాజా చిత్రాన్ని చేస్తున్నాడు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్ రోల్ నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందని అంటున్నారు. ఇక ఒక పవర్ఫుల్ రోల్ కోసం దక్షిణాది నుంచే మరో స్టార్ ను రంగంలోకి దింపుతున్నారట. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అజిత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.