ఫీచర్ ఫోన్ యూపీఐ 123 పే.. ఎలా వాడాలంటే..!

  • ఐవీఆర్ సిస్టమ్ తో తేలిగ్గా లావాదేవీలు
  • 080–45163666 నెంబర్ ద్వారా ట్రాన్సాక్షన్లు
  • నిన్న 123పేని ప్రారంభించిన ఆర్బీఐ
ఫీచర్ ఫోన్లు వాడే వారికీ యూపీఐ సేవలను అందించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిన్న ‘123పే’ అనే యూపీఐ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాని వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని 40 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం మూడంచెల్లో నెట్ అవసరం లేకుండానే 123పే ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు బ్యాంకు లావాదేవీలను జరిపేందుకు వీలుంటుంది. 

ఫీచర్ ఫోన్లతో నాలుగు రకాలుగా ఈ ట్రాన్సాక్షన్లను చేయవచ్చు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్), యాప్, ఫీచర్ఫోన్స్, ప్రాక్సిమిటీ సౌండ్ ఆధారంగా లావాదేవీలను జరపవచ్చు. ఒక్కటేంటి పేమెంట్లు, రీచార్జ్, ఫాస్టాగ్, ఇతర బిల్లులను చెల్లించవచ్చు. కాగా, ఫీచర్ ఫోన్ల నుంచి డిజిటల్ పేమెంట్ల గురించి తెలుసుకునేందుకు వీలుగా ఇప్పటికే ఆర్బీఐ digisathi.info వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. దాంతో పాటు 14431 లేదా 1800 8913333 నెంబర్లకూ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

ఐవీఆర్ కాలింగ్ ద్వారా ఇలా చేయొచ్చు

  • మొదట 080–45163666 కు 123పేను అనుసంధానించిన ఫీచర్ ఫోన్ తో కాల్ చేయాలి. 
  • ఆ తర్వాత భాషను ఎంచుకుని.. నగదును బదిలీ చేసేందుకు ఒకటిని నొక్కాలి. 
  • యూపీఐతో అనుసంధానించిన బ్యాంక్ పేరును చెప్పాలి. 
  • వివరాలను ధ్రువీకరించేందుకు 1 ప్రెస్ చేయాలి. 
  • తర్వాత ఆ మొబైల్ నంబర్ ద్వారా డబ్బును పంపేందుకు మరోసారి 1 ప్రెస్ చేయాలి. 
  • ఆ వెంటనే మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. 
  • మొబైల్ నంబర్ ను ధ్రువీకరించాక.. పంపించాలనుకున్న మొత్తాన్ని టైప్ చేయాలి. 
  • యూపీఐ పిన్ ను ఎంటర్ చేసి ఓకే చేసేస్తే సరి. డబ్బు ట్రాన్స్ ఫర్ అవుతుంది.


More Telugu News