ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటనతో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- నాటో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయబోనన్న జెలెన్ స్కీ
- 1,223 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 331 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. రష్యాతో నాటో బలగాలు యుద్ధం చేయబోవని, నాటో సభ్యత్వం కోసం ఇకపై తాను ఒత్తిడి చేయబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించడం మార్కెట్లపై అనుకూల ప్రభావాన్ని చూపింది. రష్యా డిమాండ్ కూడా ఇదే కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,223 పాయింట్లు లాభపడి 54,647కి చేరుకుంది. నిఫ్టీ 331 పాయింట్లు పెరిగి 16,345కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (5.56%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (5.24%), బజాజ్ ఫైనాన్స్ (5.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.18%).
టాప్ లూజర్స్:
వర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.89%), ఎన్టీపీసీ (-1.57%), టాటా స్టీల్ (-1.15%), నెస్లే ఇండియా (-0.88%), విప్రో (-0.31%).