కేజ్రీవాల్ ప్రధాని కావడం ఖాయం: రాఘవ్ చద్దా
- కోట్లాది మందికి కేజ్రీవాల్ ఆశాజ్యోతిగా మారారు
- కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆప్ భర్తీ చేస్తుంది
- త్వరలోనే జాతీయ పార్టీగా అవతరిస్తుంది
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ కో ఇన్ఛార్జీ రాఘవ్ చద్దా అన్నారు. దేశంలోని కోట్లాది మందికి కేజ్రీవాల్ ఆశాజ్యోతిగా మారారని ఆయన చెప్పారు. ప్రజలు అవకాశమిస్తే, దేవుడు కరుణిస్తే కేజ్రీవాల్ త్వరలోనే పీఎం అవుతారని అన్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ భర్తీ చేస్తుందని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే ఆప్ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని అన్నారు. త్వరలోనే ఆప్ జాతీయ పార్టీగా అవతరిస్తుందని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలవబోతోందనే ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో రాఘవ్ చద్దా ఈ వ్యాఖ్యలు చేశారు.