ర‌ష్యాలో లాభాలతో ఉక్రెయిన్‌కు సాయం: ఫైజ‌ర్‌

  • ర‌ష్యాలో వ్యాపారం చేస్తామ‌ని ఫైజ‌ర్ ప్ర‌క‌ట‌న‌
  • ర‌ష్యాలో వ‌చ్చే లాభాల‌ను ఉక్రెయిన్‌కు ఇస్తామ‌ని వెల్ల‌డి
  • ఆంక్ష‌ల‌కు బ‌దులుగా ఫైజ‌ర్‌ స‌రికొత్త అస్త్రం
ఉక్రెయిన్‌పై యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యాకు పారిశ్రామిక దిగ్గ‌జాలు వ‌రుస షాకులు ఇస్తున్నాయి. మెజారిటీ కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాల‌ను ర‌ష్యాలో నిలిపివేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌గా.. అందుకు విరుద్ధంగా ర‌ష్యాలో త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించిన ఔష‌ధ త‌యారీ దిగ్గ‌జం ఫైజ‌ర్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ర‌ష్యాలో త‌మకు వ‌చ్చే లాభాల‌ను ఉక్రెయిన్‌కు సాయంగా అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ త‌రహా నిర్ణ‌యం ర‌ష్యాను షాక్‌కు గురి చేసింద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు

ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న యుద్ధాన్ని పాశ్చాత్య దేశాల‌తో పాటుగా మెజారిటీ సంస్థ‌లు త‌ప్పుబ‌డుతున్నాయి. అందుకు నిర‌స‌న‌గా ర‌ష్యాతో సంబంధాలు తెంచుకుంటున్న‌ట్లుగా కూడా మెజారిటీ దేశాలు, సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. అయితే అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ఫైజ‌ర్ మాత్రం ర‌ష్యాతో సంబంధాలు కొన‌సాగిస్తామ‌ని చెబుతూనే.. ర‌ష్యాలో వ‌చ్చే లాభాల‌ను ఉక్రెయిన్‌కు సాయంగా ప్ర‌క‌టిస్తామ‌ని ఓ కొత్త త‌ర‌హా ప్ర‌క‌ట‌న చేసింది.


More Telugu News