భారీ నష్టాలను మూటకట్టుకున్న స్టాక్ మార్కెట్లు

  • 709 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 208 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 5 శాతం వరకు నష్టపోయిన టాటా స్టీల్ షేరు
దేశీయ స్టాక్ మార్కెట్ల ఐదు రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు కొంత ఊగిసలాట ధోరణిని ప్రదర్శించినప్పటికీ... ఆ తర్వాత కుప్పకూలాయి. 

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 55,776కి పడిపోయింది. నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయి 16,663కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.31%), మారుతి (1.40%), నెస్లే ఇండియా (0.82%), ఏసియన్ పెయింట్స్ (0.81%), టైటాన్ (0.47%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-4.89%), కోటక్ బ్యాంక్ (-3.11%), టెక్ మహీంద్రా (-2.92%), ఇన్ఫోసిస్ (-2.73%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.28%).


More Telugu News