కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో 'కశ్మీర్ ఫైల్స్' చిత్ర బృందం
- కశ్మీరీ పండిట్లపై అకృత్యాలే నేపథ్యంగా సినిమా
- ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు
- పలు రాష్ట్రాల్లో సినిమాకు వినోద పన్ను మినహాయింపు
- తాజాగా అమిత్ షాతో ప్రత్యేక భేటీ
కశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలే నేపథ్యంగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ద కశ్మీర్ ఫైల్స్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వినోద పన్ను రాయితీ దక్కింది. అసోం ప్రభుత్వం అయితే ఏకంగా తమ ఉద్యోగులకు హాఫ్ డే లీవ్ ఇచ్చేసి కశ్మీర్ ఫైల్స్ చూడండి అంటూ ప్రోత్సహిస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్ర బృందం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో అమిత్ షాను చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్, పల్లవిజోషి, చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను వివేక్ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.