ఆజాద్ ఇంటికి సిబల్!.. క్యూ కడుతున్న కాంగ్రెస్ సీనియర్లు!
- ఉదయం పార్టీపై సిబల్ ఘాటు వ్యాఖ్యలు
- సాయంత్రం కాగానే ఆజాద్ ఇంటికి మాజీ మంత్రి
- సిబల్ వెన్నంటే మరికొందరు నేతల క్యూ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలే సృష్టించేలా కనిపిస్తోంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణమెవరు? అంటూ పార్టీలో సీనియర్ మోస్ట్ నేతలు వరుసగా గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. బుధవారం నాడు కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు ఆ పార్టీ ఎంతగా ఇబ్బంది పడిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా అందరికంటే ముందుగా నిరసన గళం వినిపించిన పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఇంటికి పార్టీకి చెందిన కీలక నేతలు క్యూ కట్టారు. వీరిలో కపిల్ సిబల్‌తో పాటు భూపిందర్ సింగ్ హుడా, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, శశిథరూర్, మణి శంకర్ అయ్యర్, పీజే కురియన్, పరిణీత్ కౌర్, సందీప్ దీక్షిత్, రాజ్ బబ్బర్ తదితరులున్నారు.
పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కపిల్ సిబల్‌పై పార్టీ అధిష్ఠానం కారాలు మిరియాలు నూరుతుంటే... ఆయనతో పాటు పలువురు కీలక నేతలు నేరుగా ఆజాద్ ఇంటికి చేరుకోవడం చూస్తుంటే.. పార్టీలో మునుపెన్నడూ చోటుచేసుకోని పరిణామం ఏదో జరగడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.