తెలంగాణలో చికెన్ ధర ఇప్పట్లో తగ్గేలా లేదు!
- నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.180
- ఇప్పుడు రూ. 280 నుంచి రూ.300
- ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధమే కారణం
- మొక్కజొన్న, సోయాబీన్ దిగుమతి లేమి
- అవే కోళ్లకు ఆహారం కావడంతో రేట్ల పెరుగుదల
తెలంగాణలో చికెన్ ధరలు ఇప్పట్లో తగ్గేలా కనపడట్లేదు. నెల రోజుల క్రితం వరకు రూ.180 లోపు ఉన్న కిలో చికెన్ ధర ఇప్పుడు రూ. 280 నుంచి రూ.300 మధ్య ఉంది. కోళ్ల దాణా రేట్లు పెరిగాయని అందుకే చికెన్ ధరలు పెరిగాయని హ్యాచరీస్ యజమానులు అంటున్నారు. ఇందుకు ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధమే కారణమని వివరిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లకు ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్‌ను ఆహారంగా ఇస్తారు. ప్రస్తుతం వీటి ధరలు విపరీతంగా పెరిగాయి.
నెల క్రితం సోయాబీన్ ధర కిలో రూ.40 ఉండగా, ఆ ధర ఇప్పుడు రూ.70కు పెరిగింది. అలాగే, కిలో మొక్కజొన్న ధర నెల క్రితం రూ.20 నుంచి ఉండగా, ఇప్పుడు మరో ఏడు రూపాయలు పెరిగింది. మొక్క జొన్న, సోయాబీన్ ను ఉక్రెయిన్ అధికంగా పండిస్తోంది. రష్యాతో యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్‌కు మొక్కజొన్న, సోయాబీన్ ఎగుమతులు ఆగిపోవడంతో ఇక్కడ వాటి రేట్లు పెరుగుతున్నాయి. చికెన్ ధరల పెరుగుదల మరి కొన్ని నెలల వరకు కొనసాగే అవకాశం ఉంది.