జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ గ్రామస్థాయి నేతలు మహిళల ప్రాణాలు తీస్తున్నారు: నారా లోకేశ్
- కృష్ణా జిల్లాలో విఓఏ నాగలక్ష్మి ఆత్మహత్య
- వైసీపీ నేత నరసింహారావే కారకుడన్న లోకేశ్
- ఇది జగన్ పార్టీ చేసిన హత్య అని ఆగ్రహం
- ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేస్తేనే రక్షణ అని వ్యాఖ్య
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై లోకేశ్ స్పందించారు. వీఓఏ నాగలక్ష్మిది ఆత్మహత్య కాదని, జగన్ పార్టీ చేసిన హత్య అని మండిపడ్డారు. వీఓఏ నాగలక్ష్మి తాము చెప్పినట్టు వినడంలేదని వైసీపీ నేత నరసింహారావు వెంటాడి వేధించడంపై ఇచ్చిన ఫిర్యాదు పట్ల పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే, ఆమె ఆత్మహత్యకు పాల్పడేది కాదని లోకేశ్ పేర్కొన్నారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసినా వైసీపీ నేత నరసింహారావు నుంచి మహిళను రక్షించలేకపోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిందో తెలుస్తోందని విమర్శించారు.
"ముఖ్యమంత్రి గారూ, మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలకు రక్షకులుగా ఉంటారని. ప్రజల్నే భక్షిస్తారని కాదు. సొంత చెల్లెలిని తెలంగాణ తరిమేసి, బాబాయ్ ని చంపేసి ఆయన కుమార్తె ప్రాణాలకు రక్షణ లేకుండా చేసిన జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గ్రామస్థాయి వైసీపీ నేతలు మహిళల ప్రాణాలు తీస్తున్నారు. వైసీపీ నేతల అరాచకాలకు పోలీసులు అండగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలంతా కలిసి తిరుగుబాటు చేస్తేనే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ దొరుకుతుంది" అని లోకేశ్ స్పష్టం చేశారు.